- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి, 8 మందికి గాయాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల వరుసగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల వరుసగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. యజమానుల నిర్లక్ష్యం, సిబ్బంది ఏమరపాటుతో ఫైర్ యాక్సిడెంట్లు సంభవిస్తున్నాయి. తాజాగా, మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్ పరిధిలోని జియాగూడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోఫా తయారీ గోడౌన్‌లో చెలరేగిన మంటలు.. క్రమంగా మూడు అంతస్తుల బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తానికి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో చిన్నారి శివప్రియ మృతి చెందగా, 8 మందికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్త ఉస్మానియాకు తరలించి మంటలను కూడా అదుపు చేశారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటల్లో చిక్కుకున్న 25 మందిని తాాళ్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Next Story






