- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. కొన్నిగంటల్లో వరద
హైదరాబాద్ లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నచందంగా భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో రానున్న కొన్నిగంటల్లో నగరంలో వరద సంభవించే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం మొదలైంది. రెండు గంటలుగా కురుస్తోన్న వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోవడంతో.. వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురుస్తున్న వర్షాన్ని చూసి ప్రజలు జంకుతున్నారు. కాగా.. హైదరాబాద్ కు క్లౌడ్ బరస్ట్ (Cloud Burst for Hyderabad) హెచ్చరిక చేశారు తెలంగాణ వెదర్ మ్యాన్. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించారు.
అలాగే నగరంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా నాలాలు, చెరువులు పొంగి వరదలు సంభవించే అవకాశం ఉందని, ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని సూచించారు. రాబోయే కొద్ది గంటలపాటు నగర ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని తెలిపారు. అందరూ జాగ్రత్తగా, సేఫ్ గా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ (Telangana Weatherman) కోరారు.






