ఐదుగురు రైతులు సేఫ్.. సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన ఆర్మీ హెలికాప్టర్లు

by Gantepaka Srikanth |

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వాగులో చిక్కుకున్న ఐదుగురు రైతులను(Siricilla Farmers) సురక్షితంగా బయటకు వచ్చారు.

ఐదుగురు రైతులు సేఫ్.. సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన ఆర్మీ హెలికాప్టర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వాగులో చిక్కుకున్న ఐదుగురు రైతులను(Siricilla Farmers) సురక్షితంగా బయటకు వచ్చారు. ఆర్మీ హెలికాప్టర్ల(Army Helicopters) సాయంతో వారిని అధికారులు బయటకు తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. విస్తృతంగా కురిసిన వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు మత్తడి దూకడంతో పశువులను మేపడానికి వెళ్లిన నర్మల గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు అటే చిక్కుకునిపోయారు. కలెక్టర్, ఎస్పీ దగ్గరుండి సహాయక చర్యలు ప్రారంభించారు. వారికి బుధవారం సాయంత్రం డ్రోన్ సహాయంతో ఆహారం, దుప్పట్లు పంపించారు. రాత్రంతా వర్షంలోనే తడుస్తూ వణుక్కుంటూ ఉండిపోయారు. దీంతో వారిని రక్షించేందుకు ఆర్మీ హెలికాప్టర్లు కావాలని బండి సంజయ్(Bandi Sanjay) కోరడంతో వెంటనే స్పందించిన రక్షణశాఖ చాపర్లను పంపించింది. గురువారం మధ్యాహ్నం ఆ ఐదుగురు రైతులను రెస్క్యూ టీమ్ రక్షించింది.

Next Story