బీఆర్ఎస్‌కు భారీ షాక్.. ఐదుగురు కార్పొరేటర్లు రాజీనామా

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-05 14:07:42  IST  )

కల్వకుంట్ల కవిత తిరుగుబాటుతో సతమతమవుతున్న బీఆర్ఎస్ అధిష్టానానికి మరో భారీ షాక్ తగిలింది.

బీఆర్ఎస్‌కు భారీ షాక్.. ఐదుగురు కార్పొరేటర్లు రాజీనామా
X

దిశ, ఖమ్మం కార్పొరేషన్: కల్వకుంట్ల కవిత తిరుగుబాటుతో సతమతమవుతున్న బీఆర్ఎస్ అధిష్టానానికి మరో భారీ షాక్ తగిలింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఐదుగురు మహిళా కార్పొరేటర్లు(Corporators) రాజీనామా చేశారు. సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) సమక్షంలో కాంగ్రెస్‌లో చేశారు. వీరికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హస్తం కండువాలు కప్పారు.

పార్టీలో చేరిక కార్పొరేటర్లు వీరే:

= 12వ డివిజన్ కార్పొరేటర్ చిరుమామిళ్ళ లక్ష్మి

= 25వ డివిజన్ కార్పొరేటర్ గోళ్ల చంద్రకళ

= 32వ డివిజన్ కార్పొరేటర్ డోనవన్ సరస్వతి

= 40వ డివిజన్ కార్పొరేటర్ దాదే అమృతమ్మ

= 55వ డివిజన్ కార్పొరేటర్ మోతారపు శ్రావణి

ఆధునిక ఖమ్మం రూపశిల్పి తుమ్మల నాగేశ్వరరావు సమర్ధవంతమైన నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ఖమ్మం నగరాన్ని ప్రగతి బాటలో నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని కార్పొరేటర్లు ప్రకటించారు.

Next Story