Vidyasagar Rao : నా కోసం ఐదుగురు సీఎంలు వేయిట్ చేశారు..నేను రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకున్నా : విద్యాసాగర్ రావు

by Y. Venkata Narasimha Reddy |

నేను గవర్నర్ గా ఉన్నప్పుడు నా కోసం ఐదుగురు సీఎంలు ఎదురుచూసేవారని..కానీ నేను మాత్రం ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకోవడం నా బాధ్యతగా భావించానని మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు వ్యాఖ్యానించారు.

Vidyasagar Rao : నా కోసం ఐదుగురు సీఎంలు వేయిట్ చేశారు..నేను రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకున్నా : విద్యాసాగర్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : నేను గవర్నర్ గా ఉన్నప్పుడు నా కోసం ఐదుగురు సీఎం(Five CM)లు ఎదురుచూసేవార(Waited)ని..కానీ నేను మాత్రం ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని రిసీవ్ చేసుకోవడం నా బాధ్యతగా భావించానని మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు(Former Governor CH Vidyasagar Rao)వ్యాఖ్యానించారు. తాను రచించిన "ఉనిక"('Unika')- చెన్నమనేని స్వీయ చరిత్ర పుస్తకావిష్కరణ(Book Launches) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

"సాంస్కృతిక జాతీయ వాదం అందరిలో ఉందని.. పార్టీలు వేరు కావొచ్చని..పాలక పక్షాలు..ప్రతిపక్షాలు కలిసి పనిచేసే సంస్కృతి కొనసాగుతుందని..ఇదే విషయాన్ని ఎల్.కే.అద్వానీ మై లైఫ్ మై కంట్రీ పుస్తకంలో పేర్కొన్నాని గుర్తు చేశారు. ఎల్లంపల్లికి శ్రీపాద రావు పేరు పెట్టాలని డిమాండ్ చేసిందే బీజేపీ అని..వాజ్ పేయిని ప్రధాన మంత్రి అవుతావని నెహ్రూ అన్నారని..ఐక్య రాజ్య సమితిలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత అయిన వాజ్ పేయిని అప్పటి ప్రధాని పీవీ పంపించారని గుర్తు చేశారు. రాజ్యంగ నిర్మాత బీఆర్. అంబేద్కర్ ఎన్ని అవమానాలు ఎదుర్కొన్న భారత జాతిని వదిలిపెట్టలేదన్నారు.

ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రైవేట్ బిల్లు పెడితే అయన మద్దతు ఇచ్చారని.. పాస్ అయ్యేలా చేశారని విద్యాసాగర్ రావు గుర్తు చేశారు. పాలక పక్షం ప్రతిపక్షం కొన్ని సందర్భాల్లోనైనా జాతీ ప్రయోజనాల కోసం..రాజ్యాంగ, ప్రజాస్వామిక విలువల కోసం కలిసిపోక తప్పదన్నారు. కమ్యూనిస్టు అయినా నా అన్న రాజేశ్వర్ రావు కూడా సాంస్కృతిక జాతీయ వాదం నేపధ్యంలోనే తన పుస్తకంలో ఆర్ఎస్ఎస్ మనిషియైన నన్ను అభినందించారన్నారు.

దేశం అయిదవ ఆర్థిక శక్తిగా ఎదిగినా.. ఇంకా పేదరికం ఉందన్నారు. రేవంత్ రెడ్డి తీసుకున్న స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంతో పేదరికాన్ని తగ్గించవచ్చని..ఇది దేశానికి స్ఫూర్తినిచ్చే దని విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. "హైడ్రాను అందరూ పొగుడుతున్నారని..హైదరాబాద్ నగరాన్ని సుందరంగా నిర్మించుకోవాలని ముందుకు వెళ్లడం మంచిదేనన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. కోనేరు రంగారావు రిపోర్టు అమలు చేయాలని... గిరిజనుల భూ హక్కులను కాపాడాలని..అలాంటివి చేస్తే ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాలకి సహకరిస్తారని విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు.

Next Story