- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
24 గంటల్లో ఐదు బస్సు ప్రమాదాలు.. ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాల ప్రజలు
మీర్జా గూడా బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: మీర్జా గూడా బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు (series of accidents) చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో ఐదు బస్సు ప్రమాదాలు జరగడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున చేవెళ్ల మండలం మీర్జా గూడాలో టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సను ఢీకొట్టగా 19 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయాలపాలు అయ్యారు.
2వ ప్రమాదం సోమవారం రాత్రి ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు(Eluru Bus Accident) జిల్లా లింగాపాలె పరిధిలోని జూబ్లీనగర్ దగ్గర బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
3వ ప్రమాదం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న మెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రేణికుంట శివారులో కి రాగానే ధాన్యం లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు బస్‌లో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయలయ్యాయి.
4వ ప్రమాదం ఏపీలోని సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి హైవేపై చోటు చేసుకుంది. ఇందులో ట్రావెల్స్ బస్సు ఐషర్ వాహనాన్ని ఢీ కొట్టింది. బస్సు కిందపడటంతో ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
5వ ప్రమాదం నల్లగొండ జిల్లాలో అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై బుగ్గ బావి గూడెం (Buggabaavigudem) వద్ద చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతివేగంతో ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఇదిలా ఉంటే గడిచిన 48 గంటల్లో దేశవ్యాప్తంగా కూడా ఘోరమైన బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ వరుస ప్రమాదాలతో ప్రభుత్వ, ప్రైవేటు బస్సులను ఎక్కాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.






