Breaking: శంషాబాద్ సహా దేశంలో 5 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు

by Prasad Jukanti |   (  Updated:2025-11-12 12:51:11  IST  )

ఎర్రకోట ఘటన తర్వాత శంషాబాద్ సహా దేశంలో 5 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.

Breaking: శంషాబాద్ సహా దేశంలో 5 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు తర్వాత దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఈ పేలుడుకు ముందు స్లీపర్ సెల్ ఆపరేషన్ ను భద్రతాదళాలు భగ్నం చేసిన నేపథ్యంలో తదుపరి ఎక్కడ ఏం జరగబోతోందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇటువంటి పరిస్థితులుల్లో తాజాగా ఇవాళ దేశవ్యాప్తంగా ఐదు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రింవేండ్రం ఎయిర్ పోర్టులను పేల్చేస్తామని అగంతకులు ఇండిగో ఎయిర్ లైన్స్ కార్యాలయానికి మెయిల్ పంపించారు. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్స్ ఐదు ఎయిర్ పోర్టుల్లో తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుతో సహా హైదరాబాద్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బస్టాప్స్, టెంపుల్స్, షాపింగ్ మాల్స్ లో చెకింగ్స్ కొనసాగిస్తున్నారు. మరోవైపు బాంబు బెదిరింపు తర్వాత వారణాసికి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలోని ప్రయాణికులను ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు.

Next Story