- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప్పల్ నల్ల చెరువు బురదలో చేపల వేట..! మరోవైపు సుందరీకరణ పనులు
హైదరాబాద్ నగర శివారులోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఉప్పల్ నల్లచెరువు పేరుకే చెరువుగా మిగిలింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగర శివారులోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఉప్పల్ నల్లచెరువు పేరుకే చెరువుగా మిగిలింది. చెరువు అంతా మురికి బురద, కలుషిత నీరు, హానికరమైన రసాయనాల మిశ్రమంతో నిండిపోయింది. అటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్న చేపల కోసం స్థానికులు ఎగబడటం ఆందోళన కలిగిస్తోంది. కలుషిత నీరు, హానికరమైన రసాయనాల మిశ్రమంతో ఉన్న బురదలో జీవించే ఈ చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ప్రజలు తెలియకుండానే రోగాలను తమ శరీరాల్లోకి ఆహ్వానిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘తినేది చేపలు కాదు.. వాటి రూపంలో ఉన్న రోగాలు’ అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా, ఉప్పల్ చెరువు కట్ట సుందరీకరణ పనులు ప్రభుత్వం చేపట్టడంతో చెరువు కట్ట వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒకవైపు అభివృద్ధి పనులు, మరోవైపు కలుషిత చెరువులో చేపల వేట.. ఈ రెండు విరుద్ధ దృశ్యాలు అటువైపుగా వెళ్లే ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నాయి.






