- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేటీఆర్.. నువ్వేమన్న తీస్మార్‌ఖాన్ అనుకున్నావా? మెట్టు సాయికుమార్ హాట్ కామెంట్స్

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నిన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ (Mettu Sai Kumar) స్పందించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నువ్వేమన్న తీస్మార్‌ఖాన్ అనుకున్నావా? కొడంగల్ నియోజకవర్గంలో ఓడిస్తాం అంటున్న కేటీఆర్.. నీ డీఎన్‌ఏలో తెలంగాణ పౌరుషం, దమ్ము, ధైర్యం ఉంటే సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రా.. అంటూ చాలెంజ్ చేశారు. అప్పుడు చూద్దాం సిరిసిల్లలో గెలిచేది కాంగ్రెస్ లేక బీఆర్ఎస్ పార్టీనా? అని సవాల్ చేశారు. కేటీఆర్ లాంటి అసమర్థ నాయకుడిని తెలంగాణ ప్రజలు నమ్మరు అని విమర్శించారు.
బీజీపీకి అమ్ముడుపోయిన కేటీఆర్ అంటూ మండిపడ్డారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో (BRS) బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీ (BJP) పార్టీకి అమ్ముడుపోయిందని ఆరోపింపచారు. ఇది ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్‌కు ఒప్పందం జరిగిందని ఆరోపించారు. అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేయడం లేదు అని తీవ్ర విమర్శలు చేశారు.