- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపటి నుంచి 2 రోజుల పాటు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు !
తెలుగు ప్రజలకు బిగ్ అలర్ట్. జూన్ 8 అంటే రేపటి నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. జూన్ 8, 9 తేదీల్లో... ఈ చేప ప్రసాదం

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు ప్రజలకు బిగ్ అలర్ట్. జూన్ 8 అంటే రేపటి నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. జూన్ 8, 9 తేదీల్లో... ఈ చేప ప్రసాదం పంపిణీ (Fish prasadam distribution) చేయనున్నారు. హైదరాబాద్ లోని నాంపల్లి (Nampally) ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో... ఆస్తమా రోగులకు పంపిణీ చేయబోతున్నారు బత్తిన వంశస్తులు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఆర్టీసీ ప్రత్యేకంగా 140కి పైగా బస్సులు కూడా నడుపుతోంది.
చేప ప్రసాదం పంపిణీ ఉన్న నేపథ్యంలో.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ( Nampally Exhibition Grounds) దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు ( Traffic diversions ) కూడా కొనసాగానే ఉన్నాయి. రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. నాంపల్లి వైపు నుంచి చేప ప్రసాదం కోసం కార్లలో వచ్చే వాళ్ల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఎం జె మార్కెట్ నుంచి బస్సులో వచ్చే వాళ్లు... గాంధీభవన్ బస్ స్టాప్ దగ్గర దిగాల్సి ఉంటుంది.
నాంపల్లి నుంచి వచ్చేవారు గృహకల్ప బస్ స్టాప్ వద్ద దిగి ఎగ్జిబిషన్ గేట్ నెంబర్ 2 కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రవీంద్ర భారతి నుంచి వచ్చే భారీ వాహనాలను... Bjr సర్కిల్ వైపు డైవర్ట్ చేయబోతున్నారు. అబిడ్స్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను ఎం జె మార్కెట్ జంక్షన్ వద్ద.. ఎస్ ఏ బజార్ మసీద్ వైపు మళ్లించబోతున్నారు. అలస్కా జంక్షన్ నుంచి వచ్చే వాటిని మలకుంట జంక్షన్ వైపు మళ్లీ ఇస్తారు. బేగం బజార్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్ ను ఏక్ మినార్ నుంచి తరలించే ఛాన్సులు ఉన్నాయి.






