చేప ప్రసాదం పంపిణీ అప్పుడే.. ఆ పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు

by Naga Rani Yarlagadda |

జూన్ రెండోవారంలో బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జూన్ 8,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

చేప ప్రసాదం పంపిణీ అప్పుడే.. ఆ పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: జూన్ రెండోవారంలో బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జూన్ 8,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లపై సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి సమీక్ష 21 శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎగ్జిబిషన్ సొసైటీ, నిర్వాహకులు, ఎన్జీఓలు ఇతర శాఖల అధికారులతో చర్చించారు. గతేడాది జరిగిన పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

గతేడాది నిర్వహించిన చేప ప్రసాదం పంపిణీలో క్యూ లైన్లో నిలబడిన వ్యక్తి సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతి ఏటా ఆస్తమా, ఉబ్బసం, దమ్ము వచ్చే పేషంట్లకోసం పంపిణీ చేసే ఈ చేప మందు కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా అధికసంఖ్యలో ప్రజలు తరలివస్తారు. బత్తిన శంకర్‌గౌడ్ వాళ్ల తాతకు ఓ సాధువు ఈ మందు తయారీ విధానం నేర్పించి ఉచితంగా అందజేస్తే కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పడంతో అప్పటి నుంచి ఈ చేపప్రసాదం అందిస్తున్నట్లు బత్తిన కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story