First Women Commando Team : తెలంగాణలో తొలి మహిళా కమాండో బృందం ఏర్పాటు

by Muthe.Rajitha |

తెలంగాణ సర్కార్ మరో కీలక ముందడుగు వేసింది.

First Women Commando Team : తెలంగాణలో తొలి మహిళా కమాండో బృందం ఏర్పాటు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సర్కార్ మరో కీలక ముందడుగు వేసింది. ఇప్పటి వరకు భద్రతా అధికారులుగా పురుష ఆఫీసర్లే ఉండగా.. తాజాగా మహిళా కమాండోలను సిద్ధం చేసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళా కమాండో బృందాన్ని(First Women Commando Team) ఏర్పాటు చేసింది సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం. ఈ బృందానికి 'టీం శివంగి'(Team Shivangi)గా నామకరణం చేస్తూ మంత్రి సీతక్క(Minister Seethakka) చేతుల మీదుగా ఈ దళాన్ని ప్రారంభించారు. ఆదివారం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క తెలంగాణలోని మొట్టమొదటి మహిళా కమాండో బృందం నిర్మల్ జిల్లాలో ఆరంభిస్తూ.. ఇకపై అన్ని జిల్లాల్లో మహిళా కమాండో బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

మహిళా పోలీసుల్లో ఔత్సాహికులకు 45 రోజుల కఠిన శిక్షణనిచ్చి కమాండో బృందాన్ని తయారు చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. బృందంలోని కమాండోలకు ఆయుధాలు, టెక్నాలజీ వంటి తదితర అంశాలపై ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. కాగా మహిళలకు అన్ని రంగాల్లో తొలి ప్రాధాన్యత కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను మరోమారు నిలబెట్టుకున్నారని బృంద సభ్యులు తెలియజేశారు. ఇకపై ప్రత్యేక భద్రతా దళంలో పురుషులే కాదు, మహిళలు కూడా కనిపించనున్నారు.

Next Story