- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీజీ ఆయుష్ కోర్సుల తొలి దశ వెబ్ ఆప్షన్లు ప్రారంభం
కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) 2025–26 విద్యా సంవత్సరానికి పీజీ ఆయుష్ కోర్సుల ప్రవేశాల కోసం మొదటి దశ వెబ్ ఆప్షన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) 2025–26 విద్యా సంవత్సరానికి పీజీ ఆయుష్ కోర్సుల ప్రవేశాల కోసం మొదటి దశ వెబ్ ఆప్షన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎండీ ఆయుర్వేద, ఎండీ హోమియో కోర్సులకు సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం విద్యార్థులు నవంబర్ 13 సాయంత్రం 5 గంటల నుండి నవంబర్ 15 సాయంత్రం 5 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో పేరు ఉన్న అభ్యర్థులకే ఆప్షన్లు ఇవ్వడానికి అర్హత ఉందని అధికారులు తెలిపారు.
వెబ్‌సైట్ ద్వారా మాత్రమే కంప్యూటర్ ఉపయోగించి ఆప్షన్లు ఇవ్వాలని విశ్వవిద్యాలయం సూచించింది. సీట్ మ్యాట్రిక్స్ వివరాలు కాళోజీ వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. సీటు కేటాయించబడిన అభ్యర్థులు యూనివర్శిటీ ఫీజు రూ.15,000 ఆన్‌లైన్ ద్వారా చెల్లించి అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నిర్దిష్ట తేదీలోపు కేటాయించిన కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించి అడ్మిషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్యల పరిష్కారానికి సంబంధిత వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
- Tags
- AYUSH PG seats






