- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ ఎన్నికలు.. తొలి దశ అభ్యర్థుల గుర్తులు వచ్చేశాయి
రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల జోరు పెరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల జోరు పెరిగింది. రాష్ట్రంలో మూడు విడతలుగా జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశల నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యి, ఎన్నికలకు సిద్ధం అవుతుండగా.. 11న జరిగే తొలి దశ ఎన్నికల అభ్యర్థుల గుర్తులు కేటాయించింది ఎన్నికల సంఘం. తొలి విడత ఎన్నికల పోలింగ్ కు మరో వారమే మిగిలి ఉండగా.. ఇప్పటికే అభ్యర్థుల ప్రచారం స్పీడందుకుంది. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులు కూడా కేటాయించడంతో.. అభ్యర్థులు వారి గుర్తులను గుర్తుంచుకొని ఓటు వేయాలని ఓటర్లను కోరేందుకు సిద్ధం అవుతున్నారు.
పార్టీలకు అతీతంగా అభ్యర్థుల స్వభావాన్ని బట్టి లెక్క తేలనున్న పంచాయితీ ఎన్నికలలో.. ఒక్క ఛాన్స్ ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని ఓటరు దేవుళ్లను కోరుతున్నారు. ఇక మూడవ దశ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి దశ, ఈనెల 11న, రెండవ దశ 14న, మూడవ దశ పోలింగ్ ఈనెల 17న జరగనుంది.






