Delimitation : డీలిమిటేషన్ పై ముందు కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి

by Muthe.Rajitha |

తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలు(Telangana Assembly Committee Hall)లో అఖిలపక్ష సమావేశం(All Party Meeting) జరిగిన విషయం తెలిసిందే.

Delimitation : డీలిమిటేషన్ పై ముందు కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలు(Telangana Assembly Committee Hall)లో అఖిలపక్ష సమావేశం(All Party Meeting) జరిగిన విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వం తీసుకు వస్తున్న జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల పునర్విభజన(Delimitation) అంశంపై రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, కే కేశవరావు, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎవరూ హాజరు కాలేదు.

దీనిపై బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) వివరణ ఇచ్చారు. డీలిమిటేషన్ పై కాంగ్రెస్ వైఖరి ఏంటో ఇప్పటిదాకా చెప్పలేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తమ పార్టీ తరపున డీలిమిటేషన్ పై చెప్పాల్సింది చెప్పామన్నారు. అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టారో కాంగ్రెస్ నాయకులకే స్పష్టత లేదని విమర్శించారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని మేం ఎప్పట్నుంచో పోరాటం చేస్తున్నామని, స్టాలిన్ కంటే ముందు మేము దీనిపై గొంతెత్తామని కేటీఆర్ తెలిపారు. త్వరలో చెన్నైలో జరగబోయే దక్షిణాది రాష్ట్రాల అన్ని పార్టీల సమావేశానికి తాను హాజరయ్యి మాట్లాడతానని వెల్లడించారు.

Next Story