- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LLM ప్రవేశాల మొదటి విడత షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ న్యాయ కళాశాలల్లో ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పీజీఎల్ సెట్ 2025 అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన మొదటి విడత (ఫేజ్-I) షెడ్యూల్‌ను కన్వీనర్ ప్రొఫెసర్ జె. పాండురంగ రెడ్డి విడుదల చేశారు.

- ఈ నెల 27 నుండి అక్టోబర్ 6 వరకు స్లాట్ బుకింగ్‌కు అవకాశం
- వెబ్ ఆప్షన్లు అక్టోబర్ 11 నుంచి 12 వరకు
- అక్టోబర్ 15న సీట్ల కేటాయింపు
- కన్వీనర్ ప్రొఫెసర్ జె. పాండురంగ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ న్యాయ కళాశాలల్లో ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పీజీఎల్ సెట్ 2025 అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన మొదటి విడత (ఫేజ్-I) షెడ్యూల్‌ను కన్వీనర్ ప్రొఫెసర్ జె. పాండురంగ రెడ్డి విడుదల చేశారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, సర్టిఫికెట్ల అప్‌లోడ్:, ఆన్‌లైన్ చెల్లింపుతో పాటు, ఒరిజినల్ సర్టిఫికెట్లు స్కాన్ చేసిన కాపీలను ధృవీకరణ కోసం https://lawcetadm.tgche.ac.ac.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాడానికి ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు అవకాశం కల్పించారు. ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల భౌతిక ధృవీకరణకు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఉస్మానియా యూనివర్సిటీ లో ఎన్ సీసీ అండ్ పీహెచ్ అభ్యర్థులకు అక్టోబర్ 8, సీఏపీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు అక్టోబర్ 9 న ఉంటుంది. ధృవీకరించబడిన అభ్యర్థుల జాబితా వెబ్ సైట్ లో అక్టోబర్ 10 న వెల్లడిస్తారు. అక్టోబర్ 11 నుండి 12 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక, అక్టోబర్ 13 న వెబ్ ఆప్షన్ల సవరణకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 15 న తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. అక్టోబర్ 16 నుండి 18 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలని సూచించారు. అభ్యర్థులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని కన్వీనర్ తెలిపారు.






