- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD వాహనదారులకు గుడ్‌న్యూస్.. రేపటినుంచే అందుబాటులోకి
హైదరాబాద్‌లో ఫస్ట్ ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్.. రేపటినుంచే అందుబాటులోకి

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో పార్కింగ్ సమస్యపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. రద్దీ ప్రాంతాల్లో రహదారులపై వాహనాలు నిలపకుండా మల్టీ లెవల్ పార్కింగ్(Multi-level Parking) సదుపాయాలను కల్పిస్తోంది. అందులో భాగంగా నిత్యం రద్దీగా ఉండే బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్(KBR Park) వద్ద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.6 కోట్లు వెచ్చించి మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సముదాయాన్ని నిర్మించింది. ఇన్నిరోజులు అక్కడ ట్రయల్ రన్ ద్వారా వాహనాలు నిలుపారు. రేపటినుంచి(శనివారం) ప్రజలకు దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్‌లోని ఇదే మొదటి ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్ కావడం విశేషం. ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు వచ్చేవారితో పాటు చుట్టుపక్కల వారికి పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉండనుంది.
ఈ వెహికల్ పార్కింగ్ ప్రక్రియ పూర్తిగా మానవ ప్రమేయం లేకుండా ఆటోమేటిగ్‌గా జరుగుతుంది. వినియోగదారుడు క్యూఆర్ కోడ్‌తో కూడిన టికెట్‌ను స్వైప్ చేసి, వాహనాన్ని టర్న్‌టేబుల్ మీద ఉంచాలి. తర్వాత బయటకు రాగానే సిస్టమ్ తనంతట తానే వాహనాన్ని స్కానింగ్ చేసి, దాని రకాన్ని బట్టి కేటాయించిన అంతస్తులోకి పార్క్ చేస్తుంది. ఫీజు చెల్లించిన తర్వాత, వినియోగదారుడు తమ కార్డును స్వైప్ చేస్తే, వాహనం ఆటోమేటిగ్‌గా పార్కింగ్ ప్లాట్‌ఫాం నుంచి బయటకు వస్తుంది. ఈ వ్యవస్థలో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు అనుకూలమైన ఫ్లాట్ టెర్మినల్స్ ఉన్నాయి. 360 డిగ్రీలు తిరిగే సామర్థ్యంతో ప్యాలిస్ టేబుల్స్ వాహనాన్ని సరైన పద్ధతిలో ఉంచుతాయి.






