- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్రెగుట్టల్లో కొనసాగుతున్న కాల్పులు.. జవాన్ మృతి
'ఆపరేషన్ కగార్'(Operation Kagar)లో భాగంగా తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ (Telangana-Chhattisgarh) రాష్ట్రాల సరిహద్దులోని కర్రిగుట్ట (Karriguttalu)ల్లో కేంద్ర బలగాలు చేపట్టిన కూంబింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: 'ఆపరేషన్ కగార్'(Operation Kagar)లో భాగంగా తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ (Telangana-Chhattisgarh) రాష్ట్రాల సరిహద్దులోని కర్రిగుట్ట (Karriguttalu)ల్లో కేంద్ర బలగాలు చేపట్టిన కూంబింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు(Landmines), ఐఈడీ బాంబులను ఐడెంటిఫై చేస్తూ భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో మావోలు అమర్చిన ల్యాండ్‌మైన్‌పై కాలు వేయడంతో భారీ పేలుడు జరిగి DRG జవాన్ మృతి చెందినట్టు సమాచారం. నక్సల్స్ కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ల్యాండ్‌మైన్ పేలి 204 కోబ్రా కంపెనీ అసిస్టెంట్ కమాండెంట్ సాగర్ బొరడేకి తీవ్ర గాయాలై మృతి చెందినట్టు తెలుస్తోంది.
ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రత్యేక K9, K3 డాగ్ స్క్వాడ్ బృందాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కర్రిగుట్టల్లో వందల సంఖ్యలో మవోయిస్టులు భూగర్భ బంకర్లు ఉన్నట్లుగా సమాచారం అందడంతో ముందు ఆ బంకర్ల గుర్తింపునకు సీఆర్‌పీఎఫ్ (CRPF) దళాల వేట కొనసాగుతోంది. కాగా నేడు భద్రతా దళాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మరణించిన సంగతి తెలిసిందే.






