అడవిలో మంటలు.. ఆగమవుతున్న వణ్యప్రాణులు

by Rajesh |
అడవిలో మంటలు.. ఆగమవుతున్న వణ్యప్రాణులు
X

అడవిలో మంటలు చెలరేగడంతో మంటల వేడిమిని తట్టుకోలేక వన్యప్రాణులు ఆగమాగం అవుతున్నాయి. అలాగే మంటలకు తట్టుకోలేక కోతులు గ్రామాలకు తరలుతున్నాయి. కోతుల రాకతో రెండు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి, కొండాపూర్ గ్రామాల మధ్యలో ఉన్న అడవిలో గతవారం, పదిరోజుల నుంచి మంటలు చెలరేగడంతో చిన్నచిన్న చెట్లు కాలి బూడిదవుతున్నాయి.

దిశ, మనోహరాబాద్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి, కొండాపూర్ గ్రామాల మధ్యలో ఉన్న అడవిలో గతవారం, పదిరోజుల నుంచి మంటలు చెలరేగడంతో చిన్నచిన్న చెట్లు కాలి బూడిదవుతున్నాయి. ఉన్న పెద్ద చెట్లకు ఆకులు కాలిపోతున్నాయి. అడవిలో ఉన్న వన్యప్రాణులు ఆగమాగం అవుతూ మంటల వేడిమికి పొలాల బాట పడుతున్నాయి. మంటల వేడిమి తట్టుకోలేక అడవిలో ఉన్న కోతులు రెండు గ్రామాలకు తరలి వెళుతున్నాయి. ఆయా గ్రామాలలో కోతులు చేరడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

అసలే గ్రామాల్లో ఉన్న కుక్కలతో పడుతున్న ఇబ్బందులకు తోడుగా కోతుల గోలతో భయాందోళన చెందుతున్నామని ఆయా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్న అటవీ శాఖ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి అటవీ సంపదను పెంచి అడవిలో ఉన్న వన్యప్రాణుల రక్షణ కోసం చర్యలు తీసుకుంటే అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రస్తుతం చెలరేగుతున్న మంటలను నివారించి వన్యప్రాణులను రక్షించాలని కోరుతున్నారు.

Next Story