అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని పసికందును చంపిన ప్రియుడు....

by Kalyani |
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని పసికందును చంపిన ప్రియుడు....
X

దిశ, చివ్వెంల: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని 22 నెలల పసికందును చంపాడో కామ ఉన్మాది.... ఇలాంటి విషాదకరమైన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామంలో మంగళవారం సాయంకాల సమయంలో చోటుచేసుకుంది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాఠాపూర్ గ్రామానికి చెందిన మౌత్క విజయ, సాయిల్ దంపతుల కుమార్తె రమ్య అలియాస్ నవ్య శ్రీ కి అదే మండలం గుండారం గ్రామానికి చెందిన కటకట లక్ష్మణ్ తో ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది. దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె అరుణ్య కు 4 సంవత్సరాలు కాగా రెండో కుమార్తె మహాన్వికి 22 నెలలు. నవ్య శ్రీ అత్తగారు గ్రామానికి చెందిన బుల్లింకా అరవింద్ రెడ్డి తో ఏడు నెలల క్రితం అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో అరవింద్ రెడ్డి నవ్య శ్రీ తో పాటు తన ఇద్దరు పిల్లలను తానే చూసుకుంటానని నమ్మబలికించి 20 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా నుండి చివ్వెంల మండలం ఐలాపురం గ్రామానికి వచ్చి గదిని కిరాయికి తీసుకుని ఉంటున్నారు.

ఈనెల 11వ తేదీ మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో 22 నెలల పాప నిద్రిస్తుండగా పెద్ద కుమార్తె అరుణ్యను తీసుకొని కిరాణా దుకాణం వద్దకు నవ్య శ్రీ వెళ్ళింది. ఈ సమయంలో నిద్రిస్తున్న మహాన్విపై కిరాతకంగా దాడి చేసి నేలకు కొట్టి చంపి అరవింద్ రెడ్డి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటికొచ్చి చూసేవరకు విగత జీవిగా ఉన్న బిడ్డను చూసి ఏమి చేయాలో తోచక తన మేనత్త కటికలు నాగమణికి విషయం చెప్పింది. దీంతో నాగమణి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై వెంకట్ రెడ్డి కేసు నమోదు చేసుకొని రూరల్ సీఐ సురేందర్ రెడ్డి విచారణ మొదలు పెట్టారు. పోలీసుల విచారణలో మహాన్వి నుదుటిపై కమిలిన బలమైన గాయాలు రెండు భుజాలు చెంపలపై, చేతులపై, అరికాళ్ళపై, ఒంటిపై, పిరుదులపై విచక్షణ రహితంగా కొట్టినట్లు బలమైన గాయాలు ఉన్నాయి. నిందితుడు అరవింద్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.Next Story

Most Viewed