రాబోయే ఐదు సంవత్సరాల్లో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి

by Kalyani |
రాబోయే ఐదు సంవత్సరాల్లో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి
X

దిశ, ఖమ్మం రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలంలోని దానవాయిగూడెం, రామన్నపేట, పట్వారి గూడెం, కామంచికల్, పడమటి తండా, జాన్ బాద్ తండా, దారేడు గ్రామాల్లో మంత్రి పర్యటించారు. పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని, ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఏ సభ్యుడికి రాని మెజారిటీ రఘురాం రెడ్డి కి వచ్చిందన్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆయన తెలిపారు. అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన వారందరికీ తీపి కబురు అందుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరెంటు కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పాలేరు తన సొంత ఇల్లని, ప్రజలు ఇచ్చిన పదవి తో వారి కోరికలు అన్నీ తీరుస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మి నారాయణ, రెవెన్యూ డివిజనల్ అధికారి గణేష్, మిషన్ భగీరథ ఈఈ వాణిశ్రీ, స్థానిక ప్రజాప్రతినిధులు , అధికారులు, తదితరులు పాల్గొన్నారు.Next Story

Most Viewed