బీఈడీ ఉన్నవారికీ ప్రమోషన్లు!

by Ravi |
బీఈడీ ఉన్నవారికీ ప్రమోషన్లు!
X

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఉన్న బీఈడీతో నియామకమైన ఎస్జీటీ ఉపాధ్యాయ మిత్రులకు ముఖ్య సమాచారం. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, పిఎస్ హెచ్ఎం పోస్టుల ప్రమోషన్ కోసం బీఈడీతో ఎస్జీటీగా నియామకమైన వారు పూర్తి అర్హులు...పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇటీవల విడుదల చేసిన బదిలీలు, ప్రమోషన్ షెడ్యూల్ Lr.R.C.NO. 565 లో జూన్ 3న ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. కనీసం ఇంటర్మీడియట్, డీఈడీ ఉన్నా సరే, వారిని కూడా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ పోస్టులకు పరిగణిస్తూ సీనియారిటీ లిస్ట్ తయారు చేయమని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకానీ బీఈడీ ఉన్నవారికి ప్రమోషన్లు ఇవ్వకూడదు అని ఎక్కడా చెప్పలేదు. స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టుకు కచ్చితంగా డిగ్రీ, బీఈడీ ఉండాలి.. కాబట్టి డిగ్రీ బీఈడీ ఉన్నవారు, కచ్చితంగా పిఎస్ హెచ్ఎం ప్రమోషన్ పోస్టుకు పూర్తిగా అర్హులు అవుతారు

కమిషనర్ ఆర్‌సీ నెంబర్ 565 26.01.23 నాడు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం బీఎస్సీ ఎంపీసీ, బీఈడీ ఉన్నవారికి మాత్రమే ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ పోస్టు, పీఎస్ హెచ్ఎం ప్రమోషన్ ఇస్తున్నారు తప్పితే డీఈడీ ఉన్నవారిని పరిగణలోకి తీసుకోవడం లేదు, ఈ మెమో అసమంజసమైనది, దీనిని రద్దు చేయండి. బీఈడీ వారితో పాటు మా డీఈడీ వారికి కూడా ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ పిఎస్ హెడ్మాస్టర్ ప్రమోషన్లు ఇవ్వండి అని స్పష్టంగా కోర్టును కోరినట్లు ఉంది. దానికి గవర్నమెంట్ ప్లీడర్ సమాధానమిస్తూ, మేము 2009 నుండి 2015 వరకు ప్రతి ప్రమోషన్లలో బీఈడీ ఉన్నవారికి కూడా ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్, పిఎస్ హెడ్మాస్టర్ ప్రమోషన్ ఇచ్చాం, వీరితో కలిపి డీఈడీ వారికి కూడా ఇచ్చాం. ఇప్పుడు కూడా అలాగే ఇస్తాం అని కోర్టు వారికి తెలియజేయడమైనది. దానికి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులో కనీస విద్యార్హత ఇంటర్మీడియట్, డీఈడీ ఉన్న వారిని కూడా ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ పోస్టుల ప్రమోషన్‌కు పరిగణనలోకి తీసుకోండి అని స్పష్టంగా పేర్కొన్నారు.. అంతేకానీ బీఈడీ ఉన్నవారికి ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్, పిఎస్ హెడ్మాస్టర్ ప్రమోషన్ ఇవ్వకూడదని ఆ తీర్పులో ఎక్కడా పేర్కొనలేదు.. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఉన్న కేవలం బీఈడీతో నియామకమైన ఎస్జీటీ ఉపాధ్యాయులు, బీఈడీతో నియామకమైన ఎస్జీటీలు ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్, పీఎస్ హెడ్మాస్టర్ ప్రమోషన్ పొందడానికి పూర్తి అర్హత పొంది ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం, కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం మళ్లీ కోర్టుకు వెళ్లి మనము ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ ప్రమోషన్లు పొందే విధంగా ఉత్తర్వులు పొందవచ్చు. దీనికోసం కచ్చితంగా పోరాడదాం.

వైఎస్ శర్మ,

రాష్ట్ర అధ్యక్షుడు, పీటీఏ, తెలంగాణ

93933 13133Next Story

Most Viewed