ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఛార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ

by Satheesh |
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఛార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: టోల్ పెంపు నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెరిగినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఛార్జీల పెంపు వార్తలపై తాజాగా టీజీఎస్ఆర్టీసీ స్పందించింది. టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు క్లారిటీ ఇచ్చింది. సాధారణ చార్జీలు యథాతథంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుందని.. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్‌లోని టోల్ సెస్‌ను సంస్థ సవరించడం జరిగిందని పేర్కొంది. టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్ సెస్‌ను యాజమాన్యం సవరించిందని వెల్లడించింది. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవు టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.Next Story

Most Viewed