- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ సచివాలయంలో ‘ఫైర్ మాక్ డ్రిల్’.. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
అగ్నిప్రమాదాల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించడం, ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడమే లక్ష్యంగా మంగళవారం డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో భారీ 'ఫైర్ మాక్ డ్రిల్' నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అగ్నిప్రమాదాల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించడం, ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడమే లక్ష్యంగా మంగళవారం డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో భారీ 'ఫైర్ మాక్ డ్రిల్' నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరుపై తెలంగాణ రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (TGSPF) సిబ్బందికి ఈ సందర్భంగా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ విన్యాసాల్లో భాగంగా అగ్నిమాపక శాఖాధికారులు సిబ్బందికి పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ఫైర్ ఎక్స్‌టింగ్యూషర్ల వాడకంలో భాగంగా వివిధ రకాల మంటలను ఆర్పేందుకు అందుబాటులో ఉన్న పరికరాలను ఎలా ఉపయోగించాలో ప్రత్యక్షంగా వివరించారు. మంటలు వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిబ్బంది సమన్వయంపై దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (CSO) పి. దేవీ దాస్, అసిస్టెంట్ కమాండెంట్లు ఏ. అప్పాజీ, సీహెచ్. పవన్ కుమార్, ఏడీఎఫ్‌ఓ జి.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మాక్ డ్రిల్‌లో సుమారు 100 మంది టీజీఎస్పీఎఫ్ అధికారులు, సచివాలయ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ అత్యున్నత కార్యాలయమైన సచివాలయంలో భద్రతా ప్రమాణాలను పటిష్టం చేయడంలో భాగంగా ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.






