- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సికింద్రాబాద్ పరిధిలో రైల్లో మంటలు.. భారీగా ఎగిసిపడుతున్న పొగలు
ఇటీవల కాలంలో దేశంలో ఎక్కడో ఒకచోట రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో దేశంలో ఎక్కడో ఒకచోట రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. అలుగడ్డ బావి వద్ద ఉన్న స్పేర్ కోచ్‌ల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన ఫైర్, రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాద సమయంలో రైల్ కోచ్ లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






