- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : హైదరాబాద్ - బెళగావి రైలులో మంటలు
హైదరాబాద్ నుంచి బెళగావి వెళ్తున్న రైలులో మంటలు వచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నుంచి బెళగావి వెళ్తున్న రైలులో మంటలు వచ్చాయి. రైల్వే సిబ్బంది వెంటనే రైలును నిలిపివేయడంతో భారీ ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బెళగావి వెళ్తున్న ప్రత్యేక రైలు రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో వెళ్లుతుండగా బోగీ కింద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేసి, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతోమంటలు ఇతర బోగీలకు అంటుకోకుండా పెను ప్రమాదం తప్పింది.
బ్రేక్ జామ్ కావడంతో నిప్పురవ్వలు ఏర్పడి మంటలు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. మంటలు ఆర్పిన తర్వాత పూర్తిగా తనిఖీలు చేసి రైలును మళ్లీ ప్రయాణానికి అనుమతించారు. కాగా బోగి కింద మంటలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంతో ఈ రూట్లో ప్రయాణిస్తున్న రైళ్లు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.






