- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fire Accident: పంజాగుట్ట షాన్‌బాగ్ హోటల్‌లో అగ్నిప్రమాదం.. ఐదో అంతస్తులో మంటలు
హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పంజాగుట్టలోని ఓ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. పంజాగుట్టలోని ఓ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షాన్‌బాగ్ హోటల్‌లోని ఐదో అంతస్తులో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సిబ్బంది రంగంలోకి మంటలార్పుతున్నారు. అగ్ని ప్రమాదం కావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర పొగలు అలుముకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాలేదని సమాచారం. కాగా.. ఈ ప్రమాదం గల కారణాలపై పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.
కాగా, మణికొండలో నిన్న ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పాషా కాలనీలోని ఓ భవనంలో ఉన్న కిరాణా దుకాణంలో మంటలు చెలరేగడంతో సీజీరా ఖాతూన్(7), జమీలా ఖాతూన్ (70), సహనా ఖాతూన్ (40) ఊపిరాడక మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్యాస్ సిలిండర్లు పేలడంతోనే ప్రమాదం సంభవించింది.






