- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెహెఫిల్ హోటల్‌పై అగ్నిప్రమాదం.. కమ్ముకున్న దట్టమైన పొగలు
మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్‌లో గల మెహెఫిల్ హోటల్ వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్‌లో గల మెహెఫిల్ హోటల్ వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ భవనంపై ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. హోటల్ పైన ఉన్న సెల్ టవర్‌లో ప్రమాదవశాత్తు ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా భారీ ఎత్తున మంటలు, దట్టమైన నల్లటి పొగలు వ్యాపించడంతో స్థానికంగా ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
ఘటనా స్థలంలో ఫైర్ సిబ్బంది
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. అయితే, ఈ ప్రమాదానికి దారి తీసిన కచ్చితమైన కారణాలు, జరిగిన ఆస్తి నష్టం తదితర పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాణ నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇప్పటివరకు లేదు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.






