Fire Accident: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం

by Ramesh Goud |

జీడిమెట్ల(Jeedimetla) పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది.

Fire Accident: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: జీడిమెట్ల(Jeedimetla) పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది. దూలపల్లి(Doolapally)లోని ఓ కెమికల్ గోడౌన్‌(Chemical Godown)లో ప్రమాదం జరగడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో పొగలు అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది(Fire Staff) హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గోడౌన్ లో చెలరేగుతున్న మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది సాయాశక్తుల కృషి చేస్తున్నారు. ఘటనపై పోలీసులు గోడౌన్ లో షాట్ సర్క్యూట్ జరగడమే ప్రమాదానికి కారణమా? లేక మరేదైన ఉందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమయంలో గోడౌన్ లో ఎవరైనా ఉన్నారా అనేది తెలియరాలేదు.

Next Story