- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోకాపేటలో భారీ అగ్నిప్రమాదం.. మూవీ టవర్స్‌లో ఎగసిపడుతున్న మంటలు
by Naga Rani Yarlagadda |
కోకాపేటలోని మూవీ టవర్స్ అపార్ట్మెంట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం కోకాపేటలోని మూవీ టవర్స్ అపార్ట్ మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్రమంగా అపార్ట్మెంట్లోని ఫ్లాట్లకు వ్యాపించే అవకాశం ఉండటంతో.. అపార్ట్మెంట్ వాసులు భయంతో బయటికి పరుగులు తీశారు. సి - బ్లాక్ లోని సెల్లార్ మంటలు చెలరేగడంతో.. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమివ్వగా.. ఫైరింజన్లు ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటల్ని ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. కాగా.. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఏరియా పోలీసులు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






