- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదివారం పూట ఇంట్లో ఘోర ప్రమాదం.. పోలీసుల అనుమానం ఇదే!
హైదరాబాద్ శివారు ప్రాంతమైన అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివారు ప్రాంతమైన అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్, ఫ్రిడ్జ్ పేలింది. దీంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించి ఇళ్లంతా అలుముకున్నాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకున్న వృద్ధురాలిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






