సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-25 10:13:49  IST  )

సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్సులో అగ్నిప్రమాదం జరిగింది.

సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్సు పక్కనే ఉన్న మరో బిల్డింగ్ లో అగ్నిప్రమాదం జరిగింది. సూర్యకిరణ్ బిల్డింగ్ లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగగా, అవి క్రమంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంటలు ఎగసిపడుతుండటంతో వాటిని అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ ఘటనతో సికింద్రాబాద్ ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story