- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: తెలంగాణలో సన్నబియ్యం పథకం ప్రారంభం.. మంత్రి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో సన్నబియ్యం పథకం ప్రారంభమైంది...

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో సన్నబియ్యం పథకం(Fine Rice Scheme) ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్(Suryapet district Huzurnagar)లో ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు(Ration Cards) ఇస్తామన్నారు. గత ప్రభుత్వం రేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. తాము మూడు రంగుల కార్డులను అందిస్తామని తెలిపారు. రేషన్‌కార్డుదారుల్లో ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇస్తామన్నారు. ఇక 80 శాతానికి పైగా జనానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. తెలంగాణలో సన్నబియ్యం పథకం ప్రారంభమైందని...గత ప్రభుత్వం ఎలా వేధించిందో అందరికీ తెలుసు అని మండిపడ్డారు. ఇప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా తిరిగి ప్రతీకారం తీర్చుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.






