పారా త్రో బాల్ ప్లేయర్ కు ఆర్థిక కష్టాలు..

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-11 12:09:56  IST  )

శ్రీలంక వెళ్లేందుకు దాతల కోసం ఎదురుచూపులు..

పారా త్రో బాల్ ప్లేయర్ కు ఆర్థిక కష్టాలు..
X

పారా త్రో బాల్ ప్లేయర్ కు ఆర్థిక కష్టాలు..

- శ్రీలంక వెళ్లేందుకు దాతల కోసం ఎదురుచూపులు..

దిశ,నెక్కొండ: ఆ యువకుడి ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాలేదు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మాంకాల రాజశేఖర్ కు మొదటి నుండి ఆటల పట్ల ఆసక్తి ఎక్కువ. ఇటీవలి తమిళనాడులో జరిగిన నాలుగో జాతీయ పారా త్రో బాల్ ఛాంపియన్ షిప్ 2025 లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. డిసెంబర్ నెలలో శ్రీలంక దేశంలో నిర్వహించే మొదటి సౌత్ ఏషియన్ పారా త్రో బాల్ ఛాంపియన్ షిప్ కు ఎంపికయ్యాడు. శ్రీలంక వెళ్లేందుకు రూ.లక్ష తొమ్మిది వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సహకారం అందిస్తే అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తానని అన్నారు. తనకు ఆర్థిక సహాయం చేయాలనుకునే దాతలు సెల్ నంబర్ 96521 78012 కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా సహాయం చేయాలని అభ్యర్థించారు.

Next Story