జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌కు తుది నోటిఫికేషన్‌ విడుదల

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-25 18:10:40  IST  )

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ కు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది.

జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌కు తుది నోటిఫికేషన్‌ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ కు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీలో జోన్లు, సర్కిల్స్ ను పెంచుతూ నోటిఫికషన్ జారీ అయింది. డివిజన్ల సంఖ్యను 300కు పెంచుతున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించింది. GHMCని ORR వరకు విస్తరించడంతో గతంలో ఉన్న 6 జోన్లను 12 జోన్లుగా, 30 సర్కిల్స్ ను 60కి పెంచిన ప్రభుత్వం.. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్లు కొత్త జోన్లుగా ఏర్పడ్డాయి. సర్కిల్ ఆఫీసుల్లో కొత్త జోన్ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో నూతన సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.

జీహెచ్ఎంసీ డివిిజన్ల డీలిమిటేషన్ కు ఈనెల 9న ప్రాథమిక నోటిఫికేషన్ రాగా.. 10 రోజుల వరకూ అధికారులు అభ్యంతరాలను స్వీకరించారు. 6 వేలకు పైగా అభ్యంతరాలురాగా.. వాటిలో సరైన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఫైనల్ నోటిఫికషన్ విడుదల చేసినట్లుగా అధికారులు తెలిపారు.

12జోన్లకు ప్రభుత్వం కమిషనర్లను నియమించింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా హేమంత్ సహదేవ్ రావు, కూకట్ పల్లి జోనల్ కమిషనర్ గా అపూర్వ చౌహాన్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ గా సందీప్ సుల్తానియా, చార్మినార్ జోనల్ కమిషనర్ గా ఎస్. శ్రీనివాస్ రెడ్డి, గోల్కొండ జోనల్ కమిషనర్ గా జి.ముకుంద్ రెడ్డి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ప్రియాంక, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ గా అనురాగ్ జయంతి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ గా ఎన్. రవికిరణ్, శంషాబాద్ జోనల్ కమిషనర్ గా కె. చంద్రకళ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గా హేమంత్ కేశవ్ పాటిల్, మల్కాజ్ గిరి జోనల్ కమిషనర్ గా సంచిత్ గంగ్వార్, ఉప్పల్ జోనల్ కమిషనర్ గా రాధిక గుప్తా నియమితులయ్యారు.

Next Story