- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: జనవరి 16న విడుదల.. మున్సిపల్ ఎన్నికలపై ఈసీ కీలక ఆదేశాలు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై ఈసీ కసరత్తు మొదలు పెట్టింది. ఇవాళ కీలక సమావేశం నిర్వహించింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ మున్సిపాలిటీలు కార్పొరేషన్ల రెండవ సాధారణ ఎన్నికలు సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా ఈసీ పలు ఆదేశాలు జారీ చేసింది. 13 జనవరి 2026న పోలింగ్ స్టేషన్‍ల ముసాయిదా జాబితా ప్రచురణ - T-POLL యాప్‍లో అప్‌లోడ్ చేయాలని, 16 జనవరి 2026న ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా పోలింగ్ స్టేషన్‍ల వారీగా ప్రచురించాలని ఆదేశించింది. బ్యాలెట్ బాక్సుల అంచనా వేసి, అవసరమైన సామగ్రి సిద్ధం చేయాలని ఆదేశించింది. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారుల నియామకం త్వరగా పూర్తి చేయాలని సూచించింది. FST, SST బృందాల నియామకం కూడా త్వరలో పూర్తి చేయాలని సూచించింది. పోలింగ్ సిబ్బంది నియామకం కోసం ఉద్యోగుల వివరాలు T-POLLలో తక్షణమే అప్‌డేట్ చేయాలని పేర్కొంది.






