- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీపీసీసీ మార్పు అధిష్టానానిదే తుది నిర్ణయం : "ఏఐసీసీ దృష్టిలో నేను బెస్ట్ పీసీసీ చీఫ్"

- నేను, సీఎం కలిసి పని చేయడం కొందరికి మింగుడుపడడం లేదు
- అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ మీడియాకి ఉంది
- త్వరలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ల పేర్లను ప్రకటిస్తాం
- మీడియాతో టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ చిట్ చాట్
దిశ, తెలంగాణ బ్యూరో : తనపై వస్తున్న ఆరోపణలపై టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్‌గౌడ్ స్పందించారు. సరైన సమయంలో అందరికీ సమాధానం తెలుస్తుందని, టీపీసీసీ మార్పు విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. శనివారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. తాను సరైన వ్యక్తిని అనే తనకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారని, ఏఐసీసీ దృష్టిలో తాను బెస్ట్ పీసీసీ చీఫ్ అని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తనను అనేకసార్లు అభినందించారని, తాను, సీఎం కలిసి పని చేయడం కొందరికి మింగుడుపడడం లేదని ఆయన ఆరోపణలు గుప్పించారు. తనపై వచ్చిన కథనాలను తాను పట్టించుకోనని, అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ మీడియాకి ఉందన్నారు. చిన్నాచితక విషయాలపై తన సమయాన్ని వెచ్చించనని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గాంధీ భవన్ ట్రస్ట్ వాళ్ళదని, తనపై ఒక ఛానెల్ ప్రచారం చేస్తే అది ప్రామాణికం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పనితీరుని బేరీజు వేయాల్సింది సీఎం, తన పార్టీ కార్యకర్తలని, తాను పత్రిక స్వేచ్ఛను అర్థం చేసుకున్న వ్యక్తిని అని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అన్నింటికి కాలమే సమాధానం చెపుతుందని ఆయన అన్నారు.
త్వరలోనే వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రకటిస్తాం..
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల పేర్లను ఏఐసీసీకి పంపించామని, త్వరలోనే వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రకటిస్తామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కేబినెట్ విస్తరణ సీఎం చూసుకుంటారని, విస్తరణలో తన ప్రమేయం ఏముండదని ఆయన స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ దేశానికే దిక్సూచి గా మారుతుందని, సిటీ విస్తరిస్తే అభివృద్ధి జరుగుతుంది..హైదరాబాద్ అభివృద్ధి అవసరం లేదని హరీష్ రావు అంటున్నారా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు దూరదృష్టి లేదు హైదరాబాద్ పరిధిని పెంచలేదని, తెలంగాణపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆయన ఆరోపించారు. స్టాలిన్ లాగే తాము గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తున్నామన్నారు.






