ఆశావహులకు ఫైనల్ కాల్.. మద్యం టెండర్లకు నేటితో ముగియనున్న గడువు

by Kema Shiva Kumar |

అశావహులకు మరో బిగ్ అలర్ట్. నేటితో రాష్ట్రంలో కొత్త మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది.

ఆశావహులకు ఫైనల్ కాల్.. మద్యం టెండర్లకు నేటితో ముగియనున్న గడువు
X

దిశ, వెబ్‌డెస్క్: అశావహులకు మరో బిగ్ అలర్ట్. నేటితో రాష్ట్రంలో కొత్త మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు గాను ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు అభ్యర్థులు ఆన్‌లైన్‌ లేదా అందుబాటులో ఉన్న కౌంటర్లలో తమ దరఖాస్తులు సమర్పించాలని ఎక్సైజ్ శాఖ (Excise Department) అధికారులు ఫైనల్ కాల్ ఇచ్చయారు. అయితే, గత వారం బీసీ బంద్‌ (BC Bundh), బ్యాంకుల మూసివేతతో దరఖాస్తు చేయలేకపోయామని ఎక్సైజ్ శాఖకు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తు గడువును అక్టోబర్ 23 (నేటి) వరకు పొడిగించారు. ఎక్సైజ్ శాఖ నివేదిక మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం షాపులకు గాను బధవారం సాయంత్రం వరకు 90,316 దరఖాస్తులు వచ్చాయి. వాటి పరిశీలన పూర్తి అయిన వెంటనే అక్టోబర్‌ 27న లాటరీ సిస్టమ్ (Lottery System) పద్ధతిన దరఖాస్తుదారులకు మద్యం దుకాణాలను కేటాయించనున్నారు.

Next Story