- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Film workers: పనిచేయడానికి సిద్దమే.. కానీ! రహదారి దిగ్బంధం చేసి సినీ కార్మికుల నిరసన
సినీ కార్మికుల సమ్మె 16 రోజులుగా కొనసాగుతుంది. వేతనాల పెంపుతో పాటు నాలుగు అంశాలపై కార్మిక సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: సినీ కార్మికుల (Film workers) సమ్మె 16 రోజులుగా కొనసాగుతుంది. వేతనాల పెంపుతో పాటు నాలుగు అంశాలపై కార్మిక సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. మంగళవారం హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ (Film Federation) ఆధ్వర్యంలో కృష్ణ నగర్, జవహర్ నగర్ కార్యాలయం వద్ద మళ్లీ 24 క్రాఫ్ట్స్ కార్మికుల (24 Crafts workers) నిరసన చేపట్టారు. అన్నపూర్ణ శివనేకర్ రహదారిని దిగ్బంధం చేసి కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నేడు చిరంజీవి (Chiranjeevi)తో మూడు గంటలకు సమావేశం అవుతామని, ఛాంబర్ నుంచి నాలుగు గంటలకు సమావేశానికి రమన్నారని తెలిపారు. తెలుగు నిర్మాతలు ఇబ్బంది పడకుండా మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కానీ మా కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని, రూ. 13 కోట్ల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్మాతలకు ఇష్టమైన స్కిల్ ఉన్న వారిని నియమించుకోవచ్చని, ఇందుకు మేము ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. ఫైటర్స్, డాన్సర్ రేషియో విషయంలో స్థానికులు లేకపోతే ఇతర రాష్ట్రాల వారిని తీసుకోవడాన్ని అంగీకరించామని తెలిపారు. ఆదివారం డబుల్ పేమెంట్ ఇవ్వము అంటున్నారని, కానీ కుటుంబాన్ని వదిలి కొంత ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశతో పని చేస్తామని పేర్కొన్నారు. అయినా ఆ నిబంధనకు మేము కొంతవరకు ఒప్పుకున్నామని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.






