- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ ఎఫెక్ట్.. షూటింగ్స్ రద్దు చేసిన ఫిలిం ఫెడరేషన్
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికుల అభినందన సభ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సభకు పెద్ద ఎత్తున సినీ పరిశ్రమ పెద్దలు హాజరు కానున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజు సాయంత్రం 4 గంటలకు యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికుల అభినందన సభ (Film workers' appreciation meeting) జరగనున్న విషయం తెలిసిందే. ఈ సభకు పెద్ద ఎత్తున సినీ పరిశ్రమ పెద్దలు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉండటంతో ఈ అభినందన సభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గర ఉండి.. అభినందన సభ పనులనలను పరిశీలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో అభినందన సభ ఉండటం, సినిమా ఇండస్ట్రీకి కీలక కావడంతో ఫిలిం ఫెడరేషన్ (Film Federation) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జరగాల్సిన అన్ని షూటింగ్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సినిమా షూటింగ్ లు నిలిపివేయాలని ఫిలిం ఫెడరేషన్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికులు చేస్తున్న సన్మాన సభ కావడంతో అన్ని యూనియన్లలోని సభ్యులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ పిలుపునిచ్చింది.






