బీసీ రిజర్వేషన్లపై సినీ దర్శకుడు N.శంకర్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య(R Krishnaiah) అధ్యక్షతన బీసీ సంఘాలు సమావేశం అయ్యాయి.

బీసీ రిజర్వేషన్లపై సినీ దర్శకుడు N.శంకర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య(R Krishnaiah) అధ్యక్షతన బీసీ సంఘాలు సమావేశం అయ్యాయి. గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ల జీవో 46పై చర్చించారు. ఈ సమావేశంలో ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్(N Shankar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలు అంటే బలహీనులు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఇంటి నుంచి ఒకరు నామినేషన్ వేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీ చేసిన జీవో 46ను వెంటనే రద్దు చేయాలని, ఈ జీవో బీసీలకు రాజకీయ సమాధి కట్టిందని మండిపడ్డారు. జీవో 9పై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే రిజర్వేషన్లను తగ్గిస్తూ కొత్తగా జీవోను జారీ చేయడం దుర్మార్గమని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్ల ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 25, డిసెంబరు చివరివారం, జనవరిలో 130 బీసీ కులాలు, 40 ఉద్యోగ, యువజన, విద్యార్థి, మహిళ తదితర సంఘాలతో కార్యాచరణ సమావేశం ఉంటుందని కృష్ణయ్య తెలిపారు. డిసెంబరులో బీసీల చైతన్య రథయాత్ర, నగరంలోని ఎల్‌బీ స్టేడియంలో జాతీయ నేతలతో బీసీల రణగర్జన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

Next Story