Alai Balai: దత్తన్న‘అలయ్‌ బలయ్‌’.. హాజరైన గవర్నర్, సినీ రాజకీయ ప్రముఖులు

by Ramesh Naini |

హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ‘అలయ్‌ బలయ్‌’ ప్రారంభమైంది.

Alai Balai: దత్తన్న‘అలయ్‌ బలయ్‌’.. హాజరైన గవర్నర్, సినీ రాజకీయ ప్రముఖులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatraya) ఆధ్వర్యంలో ‘అలయ్‌ బలయ్‌’ (Alai Balai) ప్రారంభమైంది. (Nampally Exhibition) నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రతి ఏడాది దసరా ఆత్మీయ సమ్మేళనం అలయ్‌ బలయ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి సినీ వర్గాలు, రాజకీయ ప్రముఖులు, అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రముఖ సినీనటుడు నాగార్జున, హాస్య నటుడు బ్రహ్మానందం, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, సీపీఐ నేత నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జనసమితి చీఫ్, ప్రొఫెసర్‌ కోదండరామ్ తదితరులు హాజరయ్యారు. దత్తాత్రేయ వారికి కండువా వేసి స్వాగతం పలికారు. పలువురు కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యత కోసం దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి, వైభవం, ఆహారపు అలవాట్లను చాటిచెప్పేలా అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.

Next Story