టెన్షన్ పడకండి.. బీజేపీ కార్యకర్తకు బండ్ల గణేష్ కౌంటర్!

by Disha Web Desk 2 |
టెన్షన్ పడకండి.. బీజేపీ కార్యకర్తకు బండ్ల గణేష్ కౌంటర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రముఖ యాక్టర్, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. రాహుల్ గాంధీపై ఆయన చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియోను రీట్వీట్ చేస్తూ 'నా పేరు బండ్ల గణేష్.. నా కల రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడటం’ అంటూ గురువారం ఉదయం బండ్ల గణేష్ ట్వీట్టర్ లో రాసుకొచ్చారు. దీనిపై బీజేపీకి చెందిన ఓ కార్యకర్త రియాక్ట్ అవుతూ అన్న నేను అభిమానించే వాళ్లలో మీరు కూడా ఉన్నారు.

రాహుల్ గాంధీ ప్రధాని అనే ఈ ఒక్క విషయంలో మీ కల కలగానే మిగిరిపోతుందేమో అని అనుమానం కలుగుతోందన్నా అంటూ బదులిచ్చాడు. ఈ కామెంట్ పై బండ్ల గణేష్ స్పందించిన తీరు ఆసక్తిగా మారింది. టెన్షన్ పడకండి అన్న నా కల తప్పకుండా నిజమవుతుంది అంటూ ఫైర్ ఎమోజీని జోడిండిస్తూ అతడికి బండ్ల సమాధానం ఇచ్చారు. కాగా 2018 ఎన్నికల సమయంలో హడావుడి చేసిన బండ్ల ఆ తర్వాత రాజకీయంగా సైలెంట్ అయ్యారు. మరో కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి, వచ్చే ఏడాది లోక్ సభకు ఎన్నికలు జరుగుతాయనగా మరోసారి కాంగ్రెస్ ను సపోర్ట్ చేస్తూ ఆయన చేస్తున్న ట్వీట్లు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.



Next Story

Most Viewed