- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Actor Ali: నేను కాదు.. వాళ్లే సమాధానం చెప్తారు
by Gantepaka Srikanth |
ఫామ్‌హౌజ్(Farmhouse)లో అక్రమ నిర్మాణాలు చేపడుగున్నారని ప్రముఖ సినీ నటుడు అలీ(actor Ali)కి గ్రామ కార్యదర్శి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: ఫామ్‌హౌజ్(Farmhouse)లో అక్రమ నిర్మాణాలు చేపడుగున్నారని ప్రముఖ సినీ నటుడు అలీ(actor Ali)కి గ్రామ కార్యదర్శి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. ఆ నోటీసులపై అలీ(Ali) స్పందించారు. ఒక కన్వెన్షన్ సెంటర్ కోసం లీజుకు ఇచ్చానని అన్నారు. ఆ కట్టడాలపై లీజుకు తీసుకున్నవారే సమాధానం ఇస్తారని చెప్పారు. కాగా, వికారాబాద్ జిల్లా నవాబుపేట్(Nawabuppet) మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో సినీ నటుడు అలీకి ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌజ్‌ను అనుమతులు లేకుండా నిర్మించారని, అంతేకాకుండా ఫామ్ హౌస్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని గ్రామ పంచాయతీ తేల్చింది. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని గ్రామ సెక్రటరీ శోభారాణి(Village Secretary Sobharani) అలీకి నోటీసులు జారీ చేశారు.
Next Story






