- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యాహక్కు చట్టం అమలుపై అఫిడవిట్ దాఖలు చేయండి : ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సామాజిక కార్యకర్త తాండవ యోగేశ్ వేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్‌టీఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. ఆర్‌టీఈ అమల్లోకి వచ్చి 16 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. అలాగే.. పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని కోరారు. మరోవైపు.. గతేడాది అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఆర్‌టీఈ చట్టాన్ని అమల్లోకి తెస్తామని పేర్కొంది. దాని అమలుకు సంబంధించిన పురోగతిపై అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
- Tags
- Highcourt






