Hydra: పేదవాళ్లకు భరోసా హైడ్రా! 861 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్

by Ramesh Naini |

అమీన్ పూర్‌లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ దాదాపు పూర్తి కావాల్సి వచ్చింది. శనివారం ఉదయం మొదలు పెట్టిన కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది.

Hydra: పేదవాళ్లకు భరోసా హైడ్రా! 861 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అమీన్‌పూర్‌లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ దాదాపు పూర్తి కావాల్సి వచ్చింది. శనివారం ఉదయం మొదలు పెట్టిన కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది. రాత్రిపూట ఆపేసి ఆదివారం ఉదయం మళ్ళీ హైడ్రా ప్రారంభించింది. ముఖీం సోదరుడు అజీమ్ అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనం 90 శాతం తొలగించారు. పక్కనే ఉన్న అపార్టుమెంట్లకు ఎలాంటి నష్టం జరగకుండా హైడ్రా జాగ్రత్తలు తీసుకుందని అధికారులు చెబుతున్నారు. దీంతో అక్రమ భవనం కూల్చివేతకు సమయం పడుతోందని, అలాగే 861 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వర్క్ జరుగుతోందని అధికారులు తెలిపారు. హైడ్రా అధికారులు దగ్గరుండి ఈ ఆక్రమణల తొలగింపు, ఫెన్సింగ్ నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారు.

స్థానికులు హైడ్రాకు సహకరించడమే కాదు అభినందిస్తున్నారు. గతంలో భయం భయంగా ఉండేవాళ్లమని, ఇప్పుడు హైడ్రా రాకతో మాకు భరోసా వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. తమ ఇళ్ళను కూల్చ బోమని ప్రభుత్వం భరోసా ఇచ్చిందని, ఖాళీ స్థలాలను కాపాడుతూ హైడ్రా ఫెన్సింగ్ వేసిందని తెలిపారు. తమలో ఉన్న ఆందోళనలన్నీ పటాపంచలు అయ్యాయని, హైడ్రా చర్యలు అభినందనీయం అని స్థానికులు చెబుతున్నారు. కబ్జాలు చేసి వందల ఎకరాలను మాయం చేసి వందలు, వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన గుండాల భరతం పట్టడంలో హైడ్రా చొరవని అభినందిస్తున్నామని పలువురు సంబరాలు చేసుకున్నారు. హైడ్రా అంటే పేదవాళ్లకు భరోసా అనేది మరోసారి రుజువైందని పలువురు పేర్కొన్నారు.

Next Story