- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మల్లన్న జాతరలో రెచ్చిపోయిన మహిళా యూట్యూబర్.. మద్యంమత్తులో హల్ చల్
కొమురవెల్లి మల్లన్న(Komuravelli Mallanna) జాతరలో ఓ మహిళా యూట్యూబర్(Female You Tuber) హల్ చల్ సృష్టించింది.

దిశ, వెబ్ డెస్క్: కొమురవెల్లి మల్లన్న(Komuravelli Mallanna) జాతరలో ఓ మహిళా యూట్యూబర్(Female You Tuber) హల్ చల్ సృష్టించింది. సిద్దిపేట జిల్లా(Siddipeta District) చేర్యాల మండలం కొమరవెల్లిలో మల్లన్న స్వామి జాతర ఘనంగా జరుగుతోంది. జాతరను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇందులో భాగంగా ఓ యూట్యూబర్ గ్యాంగ్(You Tuber Gang) మల్లన్న జాతరకు వచ్చారు. జాతరలో జనసంద్రంలో వీడియోలు చిత్రీకరిస్తుండగా.. కొందరు భక్తులు వారించారు. దీంతో యూట్యూబర్ గ్యాంగ్ కి, భక్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొని ఉద్రిక్తతగా మారింది. దీంతో ఒకరిపై మరోకరు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ మహిళ యూట్యాబర్ రెచ్చిపోయి ప్రవర్తించింది. మద్యం మత్తులో బూతులు తిడుతూ.. అక్కడ ఉన్న వారిపై దాడికి పాల్పడింది. అక్కడే ఉన్న పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం వినకుండా భక్తులపై దుర్భాషలాడింది. దీనిని దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.






