- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌కు చేరుకున్న మహిళా క్రికెటర్ అరుంధతి రెడ్డి
మహిళా క్రికెటర్ అరుంధతి రెడ్డి(Arundhati Reddy) హైదరాబాద్‌కు చేరుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మహిళా క్రికెటర్ అరుంధతి రెడ్డి(Arundhati Reddy) హైదరాబాద్‌కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ క్రీడాపాధికార సంస్థ చైర్మన్ స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు వచ్చారు. కాగా, నవంబర్ 2న భారత మహిళా జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహిళా జట్టును ప్రధాని మోడీ సైతం అభినందించారు. ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టు బుధవారం ప్రధాని నివాసంలో ఆయన్ను కలిసింది. ఈ సందర్భంగా అరుంధతి రెడ్డి తన తల్లి పంపిన ఓ ప్రత్యేక సందేశాన్ని ప్రధానికి తెలియజేసింది. ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం రావడంతో అరుంధతి ప్రధానితో, "మీతో మాట్లాడే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. మా అమ్మ మీకు పంపిన ఒక సందేశాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఆమెకు మీరు హీరో అట" అని తెలిపింది. అరుంధతి మాటలకు ప్రధాని మోడీ చిరునవ్వుతో స్పందించారు. 28 ఏళ్ల అరుంధతి రెడ్డి.. ఇటీవల ముగిసిన మహిళల ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలు కావడం విశేషం.






