- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల ఇష్యూ.. ఈ నెల 30న తెలంగాణ బంద్‌కు SFI పిలుపు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలు నవంబరు 3 నుంచి బంద్ పాటిస్తామని ప్రైవేట్ కళాశాలల సమాఖ్య ఇప్పటికే స్పష్టం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలు నవంబరు 3 నుంచి బంద్ పాటిస్తామని ప్రైవేట్ కళాశాలల సమాఖ్య ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, బంద్‌కు సంబంధించి ఈ నెల 22న ప్రభుత్వానికి నోటీసులు అందజేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో పాటు స్కాలర్‌షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఈ నెల 30న ఎస్ఎఫ్ఐ (SFI) తెలంగాణ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు వెంటనే సర్టిఫికెట్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులను ఫీజుల పేరుతో వేధిస్తున్న విద్యా సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్‌ఐ బంద్‌కు పిలుపునివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సర్కార్ ఉదాసీన వైఖరికి నిరసనగా.. ఈ నెల 30న రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్, ఆఫ్ ప్రొఫెషనల్, డిగ్రీ, పీజీ విద్యా సంస్థలు, యూనివర్సిటీలను మూసివేయాలని ఎస్ఎఫ్‌ఐ నాయకులు ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు.






