- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంబీబీఎస్ విద్యార్థులకు ఫీజుల వేధింపులు?.. టీఏఎఫ్ఆర్సీకి మెడికో పేరెంట్స్ ఫిర్యాదు
తెలంగాణ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని రాష్ట్ర మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ఆరోపించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని రాష్ట్ర మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఇదే అంశంపై గత వారం అసోసియేషన్ ధర్నా నిర్వహించగా... నాలుగున్నరేళ్లకే ఎంబీబీఎస్ ఫీజులు తీసుకోవాలని యూనివర్సిటీ ప్రతి కాలేజీకి సర్క్యూలర్ పంపినా యాజమాన్యాలు ఖాతరు చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు.
నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్ల ఫీజులు చెల్లించాలని విద్యార్థులను వేదిస్తున్నాయని వారు పేర్కొన్నారు. కొన్ని మెడికల్ కాలేజీలు నాలుగున్నరేళ్లకే ఫీజులు అంగీకరించినా.. కరీంనగర్ కు చెందిన చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీలు మాత్రం మొత్తం ఫీజు చెల్లించలేదనే నెపంతో విద్యార్థులను క్లాసులకు రానివ్వడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై కాలేజీలకు నోటీసులు పంపిస్తామని ఎఫ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ ఎ. గోపాల్ రెడ్డి తెలిపారని మెడికో పేరెంట్స్ అసోసియేషన్ వెల్లడించింది. మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ కుమార్ పొడిశెట్టి, కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వెంకటేశ్వర్లు, రాఘవులు తదితరులున్నారు.






